జగనన్న పాలనలో బడుగులకు రాజ్యాధికాం -ఎంపీ రెడ్డెప్ప.
పుంగనూరు ముచ్చట్లు:
భారత రాజ్యాంగ నిర్మాణకమిటి చైర్మన్ బిఆర్.అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అని , ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సూచించిన మేరకు వైఎస్.జగన్మోహన్రెడ్డి పరిపాలన సంతృప్తికరంగా ఉందన్నారు. దళితులకు, బడుగులకు రాజ్యాధికారాన్ని ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఆర్థికాభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష నేరవేరాలని కోరారు. బడుగు బలహీన వర్గాల వారు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయభాస్కర్‌రెడ్డి, మాలమహనాడు అధ్యక్షుడు అశోక్, శ్రీనివాసులు, రాజా, నాగరాజు, గోవిందు, నాగభూషణం, శంకర్, ఫృద్వీకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: MP Reddeppa was the ruler of the Badugus during Jagananna’s rule.
