డిపిఎస్ హరితహారంలలో పాల్గోన్న ఎంపి సంతోష్ కుమార్

హైదరాబాద్ ముచ్చట్లు:


హరితహారం కార్యక్రమంలో భాగంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ల్లో  చేపట్టిన కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ హాజరయ్యారై డిపిఎస్ క్యాంపస్ లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం  ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ విద్యార్థులచే పర్యావరణాన్ని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సుమారు 3500 మంది పిల్లలకు మొక్కలు అందజేశారు. పర్యావరణం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఏటా లక్షలాది మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. డిపిఎస్ చైర్మన్ మల్క కొమురయ్య, స్కూల్ ఎండి యశస్వి మాట్లాడుతూ  డిపిఎస్ క్యాంపస్ లో ఐదు సంవత్సరాలుగా  మొక్కలు నాటుతున్నామని వెల్లడించారు. పర్యావరణంపై, ప్లాస్టిక్  అనర్థాలపై విద్యార్థులకు  అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అధిక సంఖ్యలో మొక్కలు నాటి పరిరక్షించడంతో తమ స్కూలుకు గ్రీన్ క్యాంపస్ అవార్డు రావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో షాప్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.

 

Tags: MP Santhosh Kumar who participated in DPS Haritaharam

Leave A Reply

Your email address will not be published.