వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ

గుంటూరు   ముచ్చట్లు:
నరసరావుపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయ భవనాన్ని ఈరోజు నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు,  నరసరావుపేట శాసన సభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి  ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ సువిశాలమైన ప్రాంగణంలో అన్ని హంగులతో కార్యాలయాన్ని నిర్మించటం హర్షణీయమని అన్నారు. అన్ని సౌకర్యాలతో ఏర్పాటైన ఈ కార్యాలయం పన్నుచెల్లింపుదారులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. బిజినెస్ పీపుల్స్కి ఉపయోగపడేలా నెలకు ఒకసారి వర్క్ షాప్లు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అన్ని సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచినప్పడే కొత్త కార్యాలయ నిర్మాణం వల్ల ప్రజలకు ఉపయోగం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో చీప్ కమీషనర్ ( రాష్ట్ర పన్నులు) పియుష్ కుమార్,  సంయుక్త కమిషనర్ కిరణ్ చౌదరి, ఉప కమిషనర్లు నాగజ్యోతి,  మురళి కృష్ణ, సహాయ కమిషనర్ ముత్యాలరావు,  జాయింట్ కమిషనర్ ఓంకార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:MP who opened the office of the Department of Commercial Taxes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *