దళిత సంఘంచే ఎంపీడీవో, తహశీల్ధార్‌లకు సన్మానం

MPDVO and Tahsildhar felicitated by Dalit community

MPDVO and Tahsildhar felicitated by Dalit community

Date:15/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర దళిత సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, తహశీల్ధార్‌ మాదవరాజుకు సోమవారం సన్మానం చేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శంకరప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్‌ల ఆధ్వర్యంలో అధికారులకు శాలువకప్పి , పూలమాలలు వేసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ దళితులకు ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అందజేస్తామన్నారు. దళిత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు గంగప్ప, గంగాధర్‌, గంగరాజు, చంద్రమోహన్‌, ప్రేమ్‌కుమార్‌, నాగరాజు, ఆనంద్‌, కిరణ్‌, విశ్వనాథ్‌, మోహన్‌, గణేష్‌, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

చెవిటి, మూగ వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

Tags; MPDVO and Tahsildhar felicitated by Dalit community

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *