పుంగనూరులో నాడు-నేడు పనులు వేగవంతం చేయాలి-ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
నాడు-నేడు పథకం క్రింద జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఎంఆర్సీ భవనంలో ఎంపీడీవో లక్ష్మీపతి, ఎంఈవో కేశవరెడ్డితో కలసి నాడు-నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో రెండవ విడతలో మంజురైన 39 పాఠశాలల పనులకు రూ.5.32 కోట్లు మంజూరైందన్నారు. పనులను ప్రారంభించి, మూడు నెలల్లో పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సచివాలయ అధికారులు పాల్గొన్నారు.
Tags: MPP Akkisani Bhaskar Reddy needs to speed up the work in Punganur today