ఎంపీలు… చక్రం తిప్పుతాన్నారే…

Date:09/08/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

పార్టీలు మారాయి. కాని పాత్ర మారలేదు. అందరూ ఊహించినట్లే ఆ నేతలు తమకు అప్పచెప్పిన పాత్రలోకి వెళ్లిపోయినట్లు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలకు ఎప్పుడూ పదును ఉంటుందంటారు. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే ఆయన తన స్ట్రాటజీని అమలు చేశారు. రాష్ట్రంలో శత్రువు ఎలాగూ ఉండనే ఉన్నారు. కేంద్రంలో ఉన్న శత్రువును మంచి చేసుకోవలి. వారి అవసరాలను తీర్చి తమకు ఉపయోగపడేలా చేసుకోవాలన్న ప్లాన్ సక్సెస్ అయినట్లే కన్పిస్తుంది.

 

 

చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉండగానే రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ , గరికపాటి మోహన్ రావులు టీడీపీని వీడిన సంగతి తెలిసిందే.రాజ్యసభలో టీడీపీని బీజేపీలో కూడా విలీనం చేశారు. ఇది బీజేపీ పెట్టిన కండిషన్ అయి ఉండవచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి. నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడినా, విలీనం చేసుకున్నా మోడీని, బీజేపీని పన్నెత్తు మాట చంద్రబాబు అనలేదు. గతంలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మోదీపై విరుచుకుపడిన చంద్రబాబునాయుడు తన పార్టీని రాజ్యసభలో విలీనం చేసుకున్నా నోరు మెదపలేదు. అంటే పెద్దగా రియాక్ట్ కాలేదన్న మాట.

 

 

 

ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే రాజ్యసభ సభ్యులు తమకు అప్పగించిన పాత్రలో ఒదిగిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ పేరిట వైఎస్ జగన్ ఆపేశారు.కాంట్రాక్టరు నవయుగను తప్పించారు. దీంతో సుజనా చౌదరి కేంద్రం పెద్దల వద్ద రంగంలోకి దిగారు. పోలవరం కాంట్రాక్టును తప్పించడం తప్పేనని కేంద్ర మంత్రల చేత సభలోనేచెప్పించారు. పీపీఏల విషయంలోనూ సుజనా చౌదరి ఇలాగే కేంద్రప్రభుత్వం చేత వైఎస్ జగన్ నిర్ణయానికి అడ్డుకట్ట వేశారు.

 

 

 

 

 

ఇక పోలవరం ప్రాజెక్టును తాము సమీక్షిస్తామని సుజనా చౌదరి చెప్పడం కూడా ఇందులో భాగమే. ఏపీలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు భయపడుతున్నారని సుజనా చౌదరి ఆవేదన చెందారు. ఇక తాజాగా మరో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సయితం వైసీపీ పాలనపై విరుచుకుపడుతున్నారు. రద్దుల ప్రభుత్వం మాదిరి తయారైందని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఒక స్క్రిప్ట్ ప్రకారమే హస్తినలో చంద్రబాబు కథ నడుపుతున్నారని, బీజేపీ నేతలచేతనే జగన్ ను బద్నాం చేసేందుకు పన్నిన వ్యూహం అమల్లోకి వచ్చేసిందంటున్నా

 

గంటాను బెంగపెడుతున్న సెంటిమెంట్

Tags: MPs … turn the wheel …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *