మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చెడ్డా నుంచి థీమ్ పోస్టర్ విడుదల

హైదరాబాద్ ముచ్చట్లు:

మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతకంపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీ నటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లాల్ సింగ్ చెడ్డా”. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు.ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజు గా  కీలక పాత్రలో  అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్ విడుదలైంది. మనం కథలోనా, కథే మనలోనా, ఏంటో ఈ విచిత్రం అనే పదాలుతో తయారైనా ఈ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షక వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. న‌టీన‌టులు ఆమిర్ ఖాన్, క‌రీనా కుమార్, నాగ చైత‌న్య త‌దిత‌రులు.

 

Tags: Mr Perfectionist Aamir Khan theme poster release from Lal Singh Cheddha

Leave A Reply

Your email address will not be published.