శ్రీలంకను కాపాడేస్తున్న మిస్టర్ వరుణ్

Date:12/06/2019

లండన్  ముచ్చట్లు:

వరల్డ్ కప్‌ మ్యాచ్‌లపై వరుణుడి ఎఫెక్ట్ కొనసాగుతోంది. వర్షం కారణంగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య  జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. జూన్ 7న పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య

జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఇలాగే రద్దయిన సంగతి తెలిసిందే. ఒకే ఎడిషన్‌లో ఒక్క బంతి కూడా పడకుండా రెండు మ్యాచ్‌లు రద్దు కావడం వరల్డ్ కప్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం

గమనార్హం. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్‌లకు పదే పదే వర్షం ఆటంకం కలిగిస్తుండటం ఫ్యాన్స్‌ను నిరుత్సాహానికి గురి చేస్తోంది. శ్రీలంక ఇప్పటి వరకూ

నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. తొలి మ్యాచ్ మినహా మూడు మ్యాచ్‌లపై వర్షం ఎఫెక్ట్ పడింది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో లంక 10 వికెట్ల తేడాతో ఓడింది. తర్వాత అప్ఘాన్, శ్రీలంక మ్యాచ్‌కు

కూడా వరణుడు అడ్డుపడ్డాడు. దీంతో మ్యాచ్‌ను డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 41 ఓవర్లకు కుదించారు. వర్షం కారణంగా పాకిస్థాన్, లంక మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కాగా.. తాజాగా బ్రిస్టల్ వేదికగా

బంగ్లాతో జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయ్యింది. వరుణుడి పుణ్యమాని.. కేవలం అప్ఘాన్‌పైనే కష్టపడి గెలిచినప్పటికీ.. పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో శ్రీలంక ఐదో స్థానంలో నిలిచింది. ఆడిన మూడు

మ్యాచ్‌ల్లో గెలిచిన న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. వర్షం కూడా 6 పాయింట్లతో కివీస్‌ను దాటేసిందని నిలిచిందని నెటిజన్ల సెటైర్లు వేస్తున్నారు.

రైతు బంధుకు రెండు వేల కోట్ల జమ

TagsMr. Varun who protects Sri Lanka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *