ఎంఆర్‌పిఎస్‌ ఛలో అమరావతి కరపత్రాలు విడుదల

MRPS chalo is released by Amravati pamphlets

Date:12/02/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

 

మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో ఛలో అమరావతి కార్యక్రమాన్ని ఈనెల 19న చేపట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మిద్దింటి వెంకటస్వామి, జిల్లా కోశాధికారి నరసింహులు ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మిద్దింటి వెంకటస్వామి మాట్లాడుతూ అమరావతిలో ఈనెల 19న 10 లక్షల మందితో మందక్రిష్ణ మాదిగ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మారుమూల గ్రామం నుంచి ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో మాదిగలను తరలిస్తామన్నారు. సభను విజయవంతం చేసి, రిజర్వేషన్‌ సాధించేందుకు మాదిగల సత్తా చాటుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్‌ను జనాభా దామాషా పద్దతిలో అమలు జరపాలని , ఎన్నికల హామిలను నిలబెట్టుకోవాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్‌, విశ్వనాథ్‌, విజయకుమార్‌, ఆంజప్ప, రామయ్య, అలివేలమ్మ, నాగరత్న, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

హంద్రీనీవా కాలువలో మతపెద్దలచే పూజలు

 

 

Tags: MRPS chalo is released by Amravati pamphlets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *