యం.ఆర్.పి.యస్ ఆవిర్భావ దినోత్సవం

పెద్దపల్లి  ముచ్చట్లు:

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భంచి 27 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా గోదావరిఖని పాత సి.యస్.పి. కాలని, 27వ డివిజన్ జి.యం. కాలనిలో రాష్ట్ర నాయకులు రాసపెల్లి రవికుమార్ జెండాను ఆవిష్కరించగా, రాష్ట్ర నాయకులు ఉప్పులేటి పర్వతాలు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 26 సం॥రాల నుండి మందక్రిష్ణ మాదిగ నాయకత్వంలో చిన్న పిల్లల గుండె జబ్బుల పరిష్కార విషయంపై, వికలాంగులు, వితంతువులు, ఆసరా పెన్షన్ల విషయంపై పెంపుదల కొరకు రిలే-దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు అనేక పోరాటాలు చేసి, వారికి అండగా నిలిచి, వారి హక్కులను సాధించిపెట్టడం జరిగిందన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమములో 1200 మంది విద్యార్థులు, యువకులు బలిదానాలు తీసుకున్నపుడు వారి కుటుంబాల కోసం అండగా నిలిచి హైదరాబాద్, నిజాం కాలేజి గ్రౌండ్లో వారి కుటుంబాలను ఏకం చేసి ఉద్యమము చేపడితే, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున, ఉద్యోగం, డబుల్ బెడ్ రూములు, అమరవీరుల కుటుంబాలకు సాధించిన ఘనత యం.ఆర్.పి.యస్. ది అన్నారు.  ఎం.ఆర్.పి.యస్. ఆవిర్భవించి యస్.సి.ల ఎ.బి.సి.డి.ల వర్గీకరణకు పోరాడుతూనే మానవీయ కోణంలో ప్రజా పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. సి.యస్.పి. కాలనిలో జైద శంకర్ అధ్యక్షతన, జి.యం. కాలనిలో లింగంపల్లి రాజయ్య ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమములో నాయకులు రొడ్డ సంపత్, మాతంగి కుమార్, జైద పద్మ, వనమాల, అంజమ్మ, శాంతమ్మ, ఓదెమ్మ, కనకలక్ష్మి, గోనె సంతోష్, శశికుమార్, కనకరాజు, కోండ్ర సతీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: MRPS Emergence Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *