వివాహ వేడుకలో సందడి చేసిన ‘శ్రీమతి శ్రీనివాస్’ బృందం
విజయవాడ ముచ్చట్లు:
తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన ఓ అమ్మాయిని తనదాన్ని చేసుకోవడం కోసం తన గుర్తింపును సైతం దాచిన ఓ యువకుడు, వివాహమైన తరువాత ఎదుర్కొనే సంఘటనల సమాహారంతో రూపొందించబడిన సీరియల్ ‘శ్రీమతి శ్రీనివాస్’. స్టార్ మా తో పాటుగా డిస్నీ+హాట్స్టార్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్కు అశేష తెలుగు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. అసలైన ప్రేమకు నిర్వచనం చెప్పే రీతిలో సాగుతున్న ఈ సీరియల్లోని ముఖ్య పాత్రలు శ్రీనివాస్, శ్రీదేవీలను అక్కున చేర్చుకున్నారు. తమను ఎంతగానో ఆదరిస్తోన్న ప్రేక్షకులను వ్యక్తిగతంగా కలుసుకోవడంతో పాటుగా నూతన జీవితంలోకి ప్రవేశిస్తున్న యువతీయువకులకు అభినందనలు తెలుపడంలో భాగంగా ‘శ్రీమతి శ్రీనివాస్’ బృందం ప్రత్యేకంగా పర్యటనలూ చేస్తోంది.ఇందులో బాగంగా రాజమండ్రి నగరంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైంది ‘శ్రీమతి శ్రీనివాస్’ సీరియల్ బృందం. వధూవరులకు పట్టు వస్త్రాలను అందించి అభినందనలు తెలిపిన ఈ బృందం, వివాహ వేడుకలో సందడి చేసింది. వివాహ వేడుకలలో నూతనోత్తేజం తీసుకువస్తూ, హాజరైన అతిథులతో సెల్ఫీలనూ దిగింది. ప్రేమ ఉన్న చోట బంధం మరింత బలపడుతుందన్న శ్రీమతి శ్రీనివాస్ బృందం ఆ ప్రేమసాగరంలో మునిగితేలాలని వధూవరులకు ఉద్భోదించారు.
Tags: ‘Mrs. Srinivas’ group making noise at the wedding ceremony

