చవితి ఉత్సవాలల్లో మట్టి గణపతికి క్రేజ్

Muddy Ganapathi craze during funerals

Muddy Ganapathi craze during funerals

Date:20/08/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

మన భారతీయ సంస్కృతి గొప్పదనం. కాబట్టి ఈ వినాయక చవితి ఉత్సవాల నుంచే కొత్త ఒరవడికి శ్రీకారం చుడదాం.. కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దాం.. వివిధ రకాల కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస తో తయారు చేసే విగ్రహాల వల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతోంది. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు.. మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకోవచ్చు. గొప్పలకు పోయి మనకు మనమే నష్టం చేసుకునేకంటే.. ఉన్నంతలో పండగ చేసుకొని పది మందికి మంచిని పంచిపెట్టడం మేలు.

 

 

 

 

పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ నడుస్తోంది. దీనికి అంత ప్రాధాన్యం వచ్చిందంటే.. మనవల్ల ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం చేసే పనుల వల్ల ఎదుటివారికి ఏ చిన్న కష్టం రాకూడదు. మన పండగల పరమార్థం కూడా ఇదే. సహజసిద్ధంగా లభించే అంశాలను స్వార్థ చర్యలతో విధ్వంసానికి గురి చేస్తున్నాం. అటు సంప్రదాయానికి భిన్నం గానూ వ్యవహరిస్తూ ప్రత్యేకంగా నిలవాలన్న దురాశ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కృతిమ రంగుల వినియోగం ప్రకృతిని ధ్వంసం చేస్తోంది.

 

 

 

 

కొన్నేళ్లుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కృత్రిమ రంగుల వినియోగం ద్వారా చేసిన వినాయక విగ్రహాలను ఆరాధించడం పెరిగింది. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రచారం చేసినా, ఆధ్యాత్మిక గురువులు ఎంతగా ఉపన్యాసాలు ఇచ్చినా మార్పు కనిపించడం లేదు. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేయాలని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మట్టి విగ్రహాలనే పూజించాలని అధికారులు చెబుతున్నారు.

 

 

 

 

 

కృత్రిమ రంగులతో నష్టాలు, సహజ రంగుల వినియోగంతో ప్రయోజనాలు, మట్టి గణపతుల ఆరాధన ఉపయోగంపై అధికారులు ప్రచారం చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కృత్రిమ రంగులతో చేసిన విగ్రహాలను చెరువుల్లో కలపడం వలన చెరువుల్లో నీరు కలుషితం అవుతున్నాయి. ప‌క్షులు, చేప‌ల ఉనికి పూర్తిగా క‌నుమ‌రుగైతుంది. మార్కెట్లో వివిధ రకాల పూలు, చెట్ల బెరడు, ఆకులతో రంగులను తయారు చేస్తున్నారు. అణు వైనంత కూడా రసాయనాలు లేకుండా సహజ రంగులను ఉత్పత్తి చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు మట్టి గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు.

 

 

 

 

ఎకో ఫ్రెండ్లీ కలర్స్‌ను ఎన్విరాన్ మెంటల్ ఫ్రెండ్లీ, స్కిన్ ఫ్రెండ్లీ, బయోడెగ్రేడబుల్, నో కెమికల్స్, నో వాటర్ పొల్యుషన్ పద్దతిన కలర్స్ తయారు చేస్తున్నారు. వివిధ రకాల కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాల వల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతోంది. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు.. మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకోవచ్చు. గొప్పలకు పోయి మనకు మనమే నష్టం చేసుకునేకంటే.. ఉన్నంతలో పండగ చేసుకొని పది మందికి మంచిని పంచిపెట్టడం మేలు అంటున్నారు భక్తులు.

పడిపోయిన బంగారం ధరలు

Tags: Muddy Ganapathi craze during funerals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *