ముదిరాజ్ లు రాజకీయంగా, సామాజికంగా, ఆర్దికంగా ఎదుగాలి

కామా రెడ్డి ముచ్చట్లు:
ముదిరాజ్ లు రాజకీయంగా, సామాజికంగా, ఆర్దికంగా ఎదుగాలని తెలంగాణ ముదిరాజ్ మచ్స్యకారుల సంఘం (టిఆర్ఎంఎస్) రాష్ట్ర అద్యక్షులు లోకబోయిన రమణ పిలుపు నిచ్చారు. కామా రెడ్డి జిల్లా అన్నారం గ్రామంలో జిల్లా స్థాయి టిఆర్ఎంఎస్ సమావేశం జరిగింది.సమావేశానికి ముందు అన్నారం పెద్దమ్మ ఆలయం లో సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శీలం సరస్వతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పుష్పలత, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు నిర్మల తదితరులు ప్రత్యెక పూజలు నిర్వహించారు. తదనంతరం  డప్పు చప్పులతో సరస్వతి అక్క గారి ఆధ్వర్యంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పెద్దమ్మ ఆలయం నుండి సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు హారతులతో స్వాగతమ్ పలికారు. ఈ సందర్బంగా శీలం సరస్వతి మాట్లాడుతూ గ్రామ గ్రామాన ముదిరాజ్ లు  సంఘటితమై సంఘంగా ఏర్పడి ముదిరాజ్ ల ఐక్యతను చాటాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీను మాట్లాడుతూ ముదిరాజ్ లు రాజకీయంగా ముందుకు రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పుష్పలత మాట్లాడుతూ  కేవలం కుల వృత్తి కీ కాకుండా ఇతరరంగాల్లో కుడా ముదిరాజ్ ల సత్తాను చాటాలని అన్నారు.అనంతరం గ్రేటర్ అధ్యక్షురాలు నిర్మల ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ లను ఆర్దికంగా ఆదుకోవాలని ముఖ్య మంత్రి కెసిఆర్ కు విజ్ఞప్తి చేసారు.ఈ సందర్బంగా పలు గామాలకు చెందిన కమిటిలను నియమిస్తూ వారికి నియామక పత్రాలను అంద జేశారు.ఈ కార్యక్రమం లో,కోగిల శ్రీనివాస్ ,జజ్జరి సతీష్ , కుడుము ల శ్రీను జిల్లా అధ్యక్షులు కుంట రవి, ప్లానింగ్ కమిటీ చైర్మన్ కుక్కల రాజు ,రాజేందర్ ,వెంకటేష్ ముదిరాజ్ ,రాష్ట్ర కార్యదర్శులు జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. సాదర స్వాగతం పలికిన అన్నారం గ్రామ ముదిరాజ్ కులస్తులకు నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Mudirajs must grow politically, socially and economically

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *