Natyam ad

ముడుపుల డైరీ గుట్టు రట్టయ్యేనా!

-కీలక ఘట్టానికి చేరిన ఏసీబీ దర్యాప్తు ?
-కొలిక్కి వచ్చిన ముడుపుల మళ్లింపు రూట్ మ్యాప్..

బద్వేలు ముచ్చట్లు:

 

Post Midle

బద్వేలు సబ్  రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ముడుపుల డైరీ కేసు గుట్టు త్వరలోనే రట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 నెలల క్రితం రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న ఎస్ ఆర్ ఓ మూర్తి ఇంటిలో ముడుపుల లెక్కలు రాసిన డైరీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎవరెవరికి ఎప్పుడు, ఎంత మేర డబ్బుల పంపకాలు చేసింది పొందుపరిచారు. ఆ దిశగా నిఘా విభాగం దర్యాప్తు ప్రారంభించింది. లక్షల్లోనే ముడుపుల చెల్లింపులు జరిగినట్లు  తెలుస్తోంది. డైరీలో పేర్కొన్న వారికి ఎలా మళ్లింపులు జరిగాయో రూట్ మ్యాప్ ను ఇదివరకే సేకరించినట్లు సమాచారం. ప్రధానంగా డైరీలో పేర్కొన్న విధంగా రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా ఉన్నతాధికారి కి ముడుపులు అందాయా? అది ఉంటే ఎలా ఎవరి ద్వారా ఏ విధంగా మళ్లింపు, చెల్లింపులు జరిగాయన్న దానిపై విఘా విభాగం వివరాల సేకరణ ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఏసీబీకి పట్టుబడ్డ అధికారి విచారణలో వెల్లడించిన అంశాలతో పాటు, తమదైన శైలిలో నిఘా విభాగం లోతుగా దర్యాప్తు చేపట్టింది.
తద్వారా కీలక సమాచారాన్ని ఏసీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించినట్లు సమాచారం అందుతోంది.

 

 

 

ముడుపుల వ్యవహారాలలో ఒక సబ్ రిజిస్ట్రార్ స్థాయి అధికారి పాత్ర కూడా ఉన్నట్లు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఆ దిశగా కూడా దర్యాప్తు జరిగినట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడ్డ అధికారి మూర్తి కి  అత్యంత సన్నిహితంగా, నమ్మిన బంటుగా ఉంటూ వచ్చిన ఒక బయటి వ్యక్తి ముడుపుల పంపిణీలో కీలకంగా ఉన్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదివరకే ఒకసారి అతనిని ఏసీబీ అధికారులు విచారించి పంపినట్లు తెలిసింది. ఆ సందర్భంలో అతని నుంచి ఏ వివరాలు నిఘా విభాగం బృందం సేకరించిందన్నది ప్రశ్నార్థకంగా ఉంది. మూర్తి కి సంబంధించిన లావాదేవీలను ఆ బయటి వ్యక్తి చూసేవాడని కొందరు డాక్యుమెంట్ రైటర్లు ఏసీబీ విచారణలో బయటపెట్టినట్లు ప్రచారంలో ఉంది.

 

 

గత 5 నెలలకు పైగా ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.  ముడుపుల లెక్క పక్కాగా తేల్చేందుకు ఏసీబీ పకడ్బందీగా   దర్యాప్తు చేస్తున్నట్లు అవగతం అవుతుంది. నిఘా విభాగం ఈ కేసును ఆషామాషీగా తీసుకోలేదని తెలుస్తోంది. చాలావరకు ఈ కేసు కు సంబంధించిన వివరాల సేకరణ పూర్తయినట్లు తెలిసింది. గతంలో అవినీతి నిరోధక శాఖకు ఇలాంటి కేసు గతంలో తగిలింది లేదు. ప్రస్తుతం ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారుల పాత చరిత్రను కూడా ఆరా తీసినట్లు తెలిసింది.  అందులో జిల్లా ఉన్నతాధికారి, ఒక ఎస్ ఆర్ ఓ స్థాయి అధికారి పనితీరు సక్రమంగా లేదన్న సమాచారం వెలుగులోకి వచ్చినట్లు తెలియ వచ్చింది. గతంలోనూ వారు పనిచేసిన ప్రాంతాలలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నట్లు వెలుగులోకి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద త్వరలోనే ముడుపుల డైరీ చిక్కుముడి వీడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

Tags: Mudupula’s diary is stuck!

Post Midle