క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ముగతి సర్పంచ్ విరుపాక్ష రెడ్డి
నందవరం ముచ్చట్లు:
మండల పరిధిలోని ముగతి గ్రామంలో శ్రీ దేవమ్మ దేవర, ఎమ్మిగనూరు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నిమెంట్ ను సర్పంచ్ విరుపాక్ష రెడ్డి ప్రారంభించారు. క్రీడలతో శారీరక ఉల్లాసం క్రీడలు శారీరక ఉల్లాసాన్ని ఇస్తాయి అని నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు, ముగతి గ్రామ సర్పంచు ముగతి విరుపాక్షిరెడ్డి ఈసందర్భంగా వారు మాట్లాడుతూ యువత చదువు తోపాటు క్రీడలో కూడా రాణించాలని కోరారు.క్రీడలు శారీరక ఉల్లాసాన్ని ఇస్తాయి, అలాగే ఉద్యోగుల లో ప్రత్యేక రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించింది అని తెలిపారు.గెలుపు ఆటలు ఎలా ఆడాలని నేర్పుతుంది.అలాగే ఓటమి ఇంకా మనం ఎంత బాగా ఆడాలని, అందుకు ఇంకా ప్రయత్నం చేయాలని నేర్పుతుంది.కావున గెలుపు,ఓటమి రెండు సమానంగా స్వీకరించాలి అని యంవిఆర్ యువత కు సూచించారు ఈకార్యక్రమంలో ఉప సర్పంచు బుజ్జిగి బోయ గణపతి, వైసీపీ నాయకులు రాఘవరెడ్డి, తారకరాముడు,యువ నాయకులు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Mugati Sarpanch Virupaksha Reddy inaugurated the cricket tournament