మినీ మేడారం జాతరకు ముహర్తం ఖరారు
-భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా
మేడారం ముచ్చట్లు:
తెలంగాణలో ప్రముఖ గిరిజన జాతర సమ్మక్క – సారలమ్మ జాతర.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో జరుగుతుంది. ఈ జాతర కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రెండేళ్లకు ఒకసారి జరిగే అసలు జాతర ఇప్పటికే పూర్తి అయింది. ఈ నేపథ్యంలో మేడారం మినీ జాతర నిర్వహణకు ముహర్తం ఖరారైంది. ఫిబ్రవరిలో మినీ మేడారం జాతరను నిర్వహించనున్నారు. సమ్మక్క, సారలమ్మ కు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1వ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర నిర్వహించనున్నారు.ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. మినీ జాతరకు సుమారు ఐదు లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహించనున్నారు. మర్నాడు సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేస్తారు. ఫిబ్రవరి 3వ తేదీన సమ్మక్క అమ్మవారి గద్దె శుద్ధి చేస్తారు. అనంతరం భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు అనుమతిస్తారు.ఈ మినీ మేడారం జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకురారు. మిగిత పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. మినీ సమ్మక్క – సారలమ్మ జాతరను మేడారంతో పాటు పూనుగొండ్ల, బయ్యక్కపేట, కొండాయి లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మేడారం పూజారుల మధ్య వాటాల విషయంలో నెలకొన్న మనస్పర్థలను పరిష్కరించేందుకు దేవాదాయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags: Muharram for Mini Medaram Jatara has been decided
