సింహాచలంలో ముక్కోటి ఏకాదశి
సింహాచలం ముచ్చట్లు:
సింహాచలం వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాద్రి అప్పన్న గురువారం ఉత్తర ద్వారంలో వైకుంఠవాసునిగా భక్తులకు దర్శనమిచ్చారు. అనువంశిక ధర్మకర్తకు తొలి దర్శనం కల్పించిన అనంతరం ఉదయం ఐదు నుంచి పది గంటల వరకూ సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఉత్తర ద్వారాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక క్యూలైన్లు సిద్ధమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనానికి సుమారు 50 వేల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా. వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిత్యకల్యాణంతో సహా ఇతర అన్ని రకాల ఆర్జిత సేవలు నిలివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Mukkoti Ekadashi in Simhachalam