శివపాల్ పార్టీపై ములాయం ఫోటో..

Mulayam Photo on Shivpal Party

Mulayam Photo on Shivpal Party

Date:18/09/2018
లక్నో ముచ్చట్లు:
సమాజ్ వాదీ పార్టీలో చీలిక తప్పేట్లు లేదు. శివపాల్ యాదవ్ పార్టీ పెట్టేందుకే రెడీ అయిపోయారు. ములాయం సింగ్ నచ్చజెప్పినా ఆయన వినేటట్లు లేదు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యవహారశైలికి నిరసనగానే తాను సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా పార్టీని పెట్టినట్లు శివపాల్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో పాటు ఆయన ఈరోజు పార్టీ జెండాను కూడా ప్రజలకు పరిచయం చేయడం విశేషంములాయం సింగ్ యాదవ్ స్థాపించిన సమాజ్ వాదీ పార్టీ చీల కూడదని భావించిన ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
అయితే శివపాల్ మాత్రం అఖిలేష్ ఉండగా పార్టీ మరోసారి గెలవలేదని, ఈ విషయం కార్యకర్తల దగ్గర నుంచి అందరికీ తెలుసునని, అందుకోసమే నేతాజీ ఫొటోతోనే తాను ప్రజల ముందుకు వెళతానని చెబుతున్నారు.సమాజ్ వాదీ పార్టీలో కొంత క్యాడర్ శివపాల్ యాదవ్ కు మద్దతిస్తోంది. అఖిలేష్ యాదవ్ ను మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఎప్పటి నుంచో శివపాల్ ఆరోపిస్తూ వస్తున్నారు. కాని సమాజ్ వాదీ పార్టీలో రాంగోపాల్ యాదవ్ మాటే నెగ్గుతుంది. బీఎస్పీతో పొత్తు విషయంలోనూ రాంగోపాల్ యాదవ్ సూచనలతోనే అఖిలేష్ అడుగులు వేస్తున్నారని, ఇది పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదని శివపాల్ చెబుతున్నారు.
అందుకోసమే తాను ప్రత్యేక పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఈరోజు ఆవిష్కరించిన పార్టీ జెండాపై శివపాల్ యాదవ్ తో పాటు ములాయం ఫొటో ఉండటం కూడా సమాజ్ వాదీ పార్టీని ఇరుకున పెట్టేదిలా ఉంది. తమ పార్టీ అభ్యర్థులు లోక్ సభ ఎన్నికల్లోపోటీ చేస్తారని శిపపాల్ చెబుతన్నారు. అయితే అఖిలేష్ వర్గం మాత్రం ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ చెప్పినట్లే శివపాల్ చేస్తున్నారంటున్నారు. మొత్తం మీద సమాజ్ వాదీలో చీలిక తప్పేట్లు లేదు.
Tags:Mulayam Photo on Shivpal Party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *