మావోయిస్టు వారోత్సవాల నేపధ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు 

Date:23/09/2020

భూపాలపల్లి ముచ్చట్లు

జయశంకర్  భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో  పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
అలాగే మావోయిస్టులకు అనువుగా ఉండే మల్హార్,మహాదేవపూర్ పలిమెల,మాహముత్తారం మండలాల అటవీ ప్రాంతాలలో స్పెషల్ పార్టీ పోలీసులతో కూంబింగ్ నిర్వహిస్తూ ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రక్కన గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉండటం, గోదావరికి అవతల మహారాష్ట్ర,ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు ఉండటంతో  మావోయిసట్లు గోదావరి దాటి వచ్చే అవకాశం ఉన్న నేపధ్యం లో గోదావరితో పాటు కాళేశ్వరం అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు వద్ద నిరంతరం పహారా నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్ లు,  పంప్ హౌజ్ ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసారు.

 

మహిళలు స్వశక్తితో జీవించాలి

Tags:Mumma checks by police in the wake of Maoist weekly festivities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *