‘యాత్ర’ తో మమ్ముట్టి ఫుల్ ఖుషీ

Mummoothi Full Khushi with 'Yatra'

Mummoothi Full Khushi with 'Yatra'

Date:01/11/2018

హైద్రాబాద్ ముచ్చట్లు:

దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్ పాత్రను మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి పోషించారు. మహి వి.రాఘవ్ దర్శకత్వం వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడిన రాజశేఖర్రెడ్డి పాదయాత్రను ప్రధాన కథాంశంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. అయితే ‘యాత్ర’ ప్రయాణంలో మమ్ముట్టితో తనకు ఏర్పడిన అనుబంధాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ వివరించారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టారు. మమ్ముట్టిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘390కి పైగా సినిమాలు, 3 జాతీయ అవార్డులు, 60కి పైగా నూతన దర్శకులతో పనిచేసిన అనుభవం. వీటన్నిటికీ మించి ఆయన గొప్ప గురువు, అద్భుతమైన వ్యక్తి. ఆయన నిరూపించుకోవడానికి ఇంకేమీ లేదు. సూర్యకాంతి నుంచి ఆయన అలా పక్కకు వెళ్లిపోయినప్పటికీ దిగ్గజంగానే మిగిలిపోతారు.

అతిథిని గౌరవించడం మన సంస్కృతి, సంప్రదాయం. ఒక నటుడిగా ఆయన విఫలమైనా, మీ అంచనాలను అందుకోకపోయినా ఆయన్ను మీరు విమర్శించవచ్చు. ఒక విమర్శకుడిగా, ప్రేక్షకుడిగా మీకు ఆ హక్కు ఉంది’ అని రాఘవ్ తన పోస్ట్లో  పేర్కొన్నారు. అయితే, తాను చేసే పనిపై మమ్ముట్టికి ఎంత నిబద్ధత ఉంటుందో రాఘవ్ ఇదే పోస్టులో వివరించారు. నటుడిగా తన పూర్తి బాధ్యతను ఎలా నిర్వర్తిస్తారో ఉదాహరణతో సహా చెప్పుకొచ్చారు. ‘యాత్ర స్క్రిప్టు మొత్తం తెలుగులోనే విన్నారు. ప్రతి పదానికి అర్థాన్ని అడిగి తెలుసుకున్నారు.

ప్రతి ఒక్క తెలుగు పదాన్ని ఆయన భాషలో రాసుకుని, ఆ వ్యాఖ్యాలను సెట్లో అద్భుతంగా పలికేవారు’ అని ‘యాత్ర’ షూటింగ్లో మమ్ముట్టి కష్టాన్ని వివరించారు. ప్రతి వ్యాఖ్యాన్ని తన భాషలోకి డబ్ చేసుకుని అది ప్రామాణికంగా రావడానికి రీ-డబ్బింగ్ చెప్పిన నటుడు మమ్ముట్టి అంటూ కొనియాడారు. మమ్ముట్టికి మన భాషన్నా, సంప్రదాయమన్నా, ఇక్కడి సినిమాలన్నా ఎంతో ఇష్టమని రాఘవ్ పేర్కొన్నారు. ఇంతకు మించి ఆయన నుంచి ఏమీ కోరుకోవడం లేదని అన్నారు. ‘నా గుండె మీద చేయి వేసుకొని చెబుతున్నా, ఈ పాత్రను వేరే ఏ నటుడూ ఇంత బాగా చేయలేరు. కథకు ఆయన జీవం పోశారు. ఆయన నిజంగా మ్యాజికల్, అద్భుతం. మేం చేసిన ఈ ‘యాత్ర’ను ఎప్పటికీ మరిచిపోను’ అని రాఘవ్ పోస్టులో పేర్కొన్నారు.

రిలయన్స్ జియో తన హవా

Tags:Mummoothi Full Khushi with ‘Yatra’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *