మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ        

మంథని ముచ్చట్లు:

ఇటీవల వచ్చిన వరదలకు మంథని పట్టణ శివారులోని మాత శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం మంపుకు గురికాగ దానిని మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ ఆరోగ్య కేంద్రాన్ని మున్సిపల్ పారిశుధ్య కార్మికులచే పరిశుభ్రం చేయించి చెత్తను తొలగించి పేరుకుపోయిన బురదను తొలగించారు.గత కొద్ది రోజులుగా భారీ వర్షాల వరద నీట మునిగి తేలిన మంథని మార్కెట్ను పరిశీలించి వరద నీటి ధాటికి బురదతో నిండుకున్న మంథని కూరగాయల మార్కెట్ ను సైతం మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించి శానిటేషన్ చేయించారు చైర్మన్ పుట్ట శైలజ. పట్టణంలో బురదతో నిండుకున్న  ప్రదేశాలను  మున్సిపల్ సిబ్బంది సహాయంతో శుభ్రం చేయించారు.

 

Tags: Municipal Chairman Putta Shailaja inspected the Mata Shishu Arogya Kendra

Leave A Reply

Your email address will not be published.