Natyam ad

డ్రైనేజీ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ

మంథని ముచ్చట్లు:

మంథని మున్సిపల్ పరిధిలో గల 11వార్డులోని మర్రివాడలో శుక్రవారం డ్రైనేజీ పనులను మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ పరిశీలించారు. గత కొద్ది రోజుల నుండి మర్రివాడలో మురుగునీటి కాలువలోని పాత పైప్ లైన్ దెబ్బతిని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు 11వ వార్డు కౌన్సిలర్ వికె.రవి కి విన్నవించగా ఆయన మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి కొత్త డ్రైనేజీ పైపుల ఏర్పాటుకు ఆమోదం తెలుపగా పనులు ప్రారంభమయ్యాయి. ఆ పైపులైను పనులను చైర్మన్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.  ఈ పరిశీలన కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ వికె రవి, టిఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్  బండారి శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

 

Tags: Municipal Chairman Putta Shailaja supervised the drainage works

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.