తునిలో వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన మునిసిపల్ ఛైర్ పర్సన్

తుని ముచ్చట్లు :

కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రజలంతా ముందుకొచ్చి వ్యాక్సినేషన్ వేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధారాణి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని ఆమె తెలియజేశారు.సెకెండ్ వేవ్ లో   కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతుందన్నారు.థర్డ్ వేవ్    ఎదుర్కొనేందుకు ప్రజలందరూ ముందుగానే వ్యాక్సినేషన్ వేయించుకొని సిద్ధంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.మునిసిపల్ చైర్మన్  స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మరియు సీతారాంపురం ఉన్నత పాఠశాల జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. వైద్యులను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.కోవిడ్ వేక్సిన్ వేయించుకునేవారందరికి, నిర్భయంగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆమె అత్మస్థైర్యాన్ని కల్పించారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Municipal Chairperson inspecting vaccination centers in Tuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *