మునిసిపల్ అధికారి రాసలీలలు-బీజేపీ నేతల నిరసన

హైదరాబాద్ ముచ్చట్లు :

అల్వాల్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాసలీలలు చేస్తూ తన ఫోటోలను తానే గ్రూప్ లో వేసులోని తన నిజస్వరూపం బయట పెట్టుకున్నాడని.. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం అల్వాల్ సర్కిల్లోని ఆల్వాల్ మున్సిపల్ కార్యాలయం ముందు డిప్యూటీ కమిషనర్ వేరే మహిళతో అసభ్యకరంగా ఫోటోలు దిగి తన పొరపాటుతో సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసుకోవడాన్ని నిరసిస్తూ మహిళలపై ఆయన దుష్ప్రవర్తన ను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయానికి మహిళలు రావాలంటే భయపడుతున్నారని, కార్యాలయంలో ఎంత మంది మహిళలు కూడా పనిచేస్తున్నారని వారు కూడా భయాందోళనకు గురవుతున్నారని ఆరోపించారు. తను చేసిన తప్పును ఒప్పుకోకపోగా, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి, తను చేసిన నేరానికి తప్పించుకుంటున్నారని విమర్శించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Municipal official Rasali-BJP leaders protest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *