అక్రమ లేఔట్లతో మున్సిపల్‌ ఆదాయానికి గండి

Municipal revenue with improper layouts

Date:16/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో అక్రమలేఔట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. దీని కారణంగా మున్సిపాలిటికి , రెవెన్యూకు లక్షలాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. పట్టణంలోని కోట్లాది రూపాయలు విలువైన గోకుల్‌ విస్తరణ ప్రాంతంలో గల స్థలాలు, మదనపల్లె రోడ్డు మంగళం కాలనీ, కృష్ణమరెడ్డిపల్లె వెళ్లే రహదారిలో గల స్థలాల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా జరుగుతోంది. ఇలా ఉండగా ప్రభుత్వ నిబంధనల మేరకు ప్లాట్లు వేసి విక్రయించే వారు ముందుగా రెవెన్యూ వారికి ధరఖాస్తు చేసి, వ్యవసాయ భూమిని వ్యాపార భూమిగా మార్చుకుని , ఇందుకు రుసుము చెల్లించాలి. అలాగే ఇందు కోసం మున్సిపాలిటిలో ధరఖాస్తు చేసి, లేఔట్‌ అప్రువల్‌ పొందాలి. ఇందు కోసం లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి చె ల్లించాల్సి ఉంది. దీనిని ఎగవేసేందుకు వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా మట్టిని తోలి రోడ్లు వేసి, రాళ్లు నాటి వ్యాపారం చేపట్టారు. చట్ట ప్రకారం ఇలాంటి అనుమతి లేని లేఔట్లలో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదు. కానీ ప్రజల అమాయకత్వాన్ని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు సొమ్ము చేసుకుంటు ప్లాట్లు కట్టబెడుతున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై కమిషనర్‌ కెఎల్‌.వర్మ దృష్టికి తీసుకెళ్లగా గోకుల్‌ •యెటర్‌ వద్ద అక్రమ లేఔట్లపై విక్రయాలు జరగకుండ సబ్‌ రిజిస్టార్‌కు సబ్‌ కలెక్టర్‌ ద్వారా ఉత్తర్వులు పంపామన్నారు. మంగళం, కృష్ణమరెడ్డిపల్లె రహదారిలో లేఔట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు లేని లేఔట్లను ప్రజలు కొనరాదన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రేషన్‌షాపు తెరిపించండి

Tags: Municipal revenue with improper layouts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *