Natyam ad

మున్సిపల్ స్కూల్ స్వీపర్స్ కు కనీస వేతనాలు ఇవ్వాలి-ఏఐటీయూసీ

కడప ముచ్చట్లు:


కడప నగరంలో మున్సిపల్ పాఠశాలల యందు 20 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న స్కూల్స్ స్వీపర్లందరికి కనీస వేతనాలు చెల్లించాలని సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం స్పందనలో డీఆర్వో గారికి ఏఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసి.బాదుల్లా వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్ స్కూల్స్ ను ప్రభుత్వ ఆధీనంలో విలీనం చేయడంవల్ల స్కూల్ స్విపర్స్ 20 సం పైబడి కొనసాగుతున్న వీరీ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.పార్ట్ టైం అని చెప్పి స్కూలు ఉదయం 7 గంటల నుంచి స్కూలు మూసిన ఐదు గంటల వరకు స్కూల్ ఆవరణ పరిశుభ్రతతో పాటు మధ్యాహ్న భోజనము తదితర పనులు అన్నింటినీ చేయిస్తున్నారన్నారు.
నేలకు150/-రూ వేతనం నుంచి నేడు 4000/-రూ చాలి చాలని వేతనం వరకు పనిచేస్తున్నారని కనీస వేతనాలు 15వేలు రూ పెంచాలని కోరారు.పెండింగ్ లో ఉన్న నవంబర్ నెల వేతనము తక్షణం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ స్విపర్స్ అరుణ,మున్నీ, షాహిన, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Municipal school sweepers should be given minimum wages-AITUC

Post Midle
Post Midle