Natyam ad

పుంగనూరులో గుండెపోటుతో మున్సిపల్‌ కార్మికుడు మృతి 

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని మున్సిపాలిటిలో కాంట్రాక్ట్ కార్మికుడుగా పని చేస్తున్న ఎస్‌.గురుమూర్తి(32) గురువారం సాయంత్రం  గుండెపోటుతో మృతి చెందాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్లి చాతిలో నొప్పిగా ఉందని తెలపడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌, చైర్మన్‌ అలీమ్‌బాషా, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట సుబ్బయ్య, కార్మిక సంఘ నాయకుడు శ్రీరాములు మృతుడి కుటుంభానికి సంతాపం తెలిపి, నివాళులర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

Post Midle

Tags: Municipal worker died of heart attack in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.