టీడీపీ శ్రేణులకు అడ్డుకున్న మునిసిపల్ కార్మికులు

 Date:08/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
రాష్ట్ర వ్యాప్తం గా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మె గుంటూరు జిల్లా మంగళగిరి లో వివాదానికి నిలయమైంది. స్థానిక పారిశుధ్య కార్మికులు 5 రోజులుగా విధులకు హాజరు కాకుండా సమ్మె బాట పట్టారు. ఈ తరుణం లో ఎక్కడి చెత్త అక్కడ పెరుకుపోవటం తో స్థానిక టీడీపీ కార్యకర్తలు కొందరు మార్కెట్ సెంటర్ లో పారిశుధ్య పనులు నిర్వహించారు. రోడ్లను ఊడ్చి చెత్త ఎత్తారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులు అక్కడకు చేరుకుని టీడీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి  దిగారు. మా సమస్యలపై మేము సమ్మె లో ఉండి పోరాటం చేస్తుంటే మీరు చేసిన పని బాగోలేదని ఆందోళన చేపట్టారు.
ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ  జరిగింది. టీడీపీ కార్యకర్తలు ఎత్తిన చెత్తను రోడ్ల పై పోయించి ఆందోళనకు దిగారు పారిశుధ్య కార్మికులు. వివాదం ముదురడంతో  పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దానితో వ్యవహారం సర్దుమణిగింది. అయినప్పటికీ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తన ఆందోళన ఆపలేదు. 279 జీవో ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. రోడ్డుపై మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కోనసాగిస్తామని ఆందోళన చేపట్టారు.
Tags:Municipal workers hindering TDP rankings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *