మున్సిపల్‌ కార్మికులు కళ్లకు నల్లగంతలతో నిరసన

Municipal workers protest against black eyes

Municipal workers protest against black eyes

Date:11/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిల్లో పని చేస్తున్న కార్మికులు తమ సమస్యలను సత్వరం పరిష్కరించాలంటు కళ్లకు నల్లగంతలు కట్టుకుని నిరసన తెలిపారు. దీక్షలు ఏఐటియుసి కార్యదర్శి వెంకట్రమణారెడ్డి , కార్మిక సంఘ అధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజు దీక్షలు జరిగాయి. గురువారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులనుద్ధేశించి వెంకట్రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోకుండ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఉధ్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు వెట్టిచాకిరి చేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఎక్కడ ఇస్తున్నారని నిలధీశారు. ప్రభుత్వం జారీ చేసిన 279 జీవోను రద్దు చేయాలని, ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, పట్టణం విస్తరిస్తున్నందున విస్తరణ ప్రాంతాలకు కొత్త కార్మికులను నియమించాలని , కార్మికులందరికి ఇండ్లు, పెన్షన్‌ , ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఈ విషయమై వెంటనే ప్రభుత్వం స్పందించాలని లేకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డెప్ప, వెంకట్రమణ, రెడ్డెమ్మ, చిన్న నాగయ్య, నాగమ్మ, ఈశ్వరమ్మ, కవిత, ఎం.లక్ష్మి, శీరిష, ఆంజప్ప, సుమన్‌, రాములు, బాబు, అంజి, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి భాజపాలో చేరిక

Tags: Municipal workers protest against black eyes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *