అక్రమ కట్టడాలు, అనధికార లేఔట్లపై మున్సిపాలిటి కన్నెర్ర

Municipality Connerra on illegal structures and unauthorized layouts

Municipality Connerra on illegal structures and unauthorized layouts

– భవనాలు తొలగింపు
– స్థలాల విక్రయాలు నిషేధం

Date:16/11/2019

పుంగనూరు ముచ్చట్లు :

ఎన్నడు లేని విధంగా మున్సిపాలిటిలో అక్రమ కట్టడాల తొలగింపు, అనధికార లేఔట్లలో రిజిస్ట్రేషన్లు నిషేధిస్తూ మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ చర్యలు తీసుకోవడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేయగా రియల్టర్లు మాత్రం బెంబేలెత్తిపోతున్న సంఘటన శనివారం పుంగనూరులో జరిగింది. కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రభుత్వాదేశాల మేరకు పుంగనూరు, మదనపల్లె, పలమనేరు, కుప్పం ప్రాంతాలు అర్బన్‌ అథారిటి పరిధిలో ఉందన్నారు. ఇందులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన ప్రణాళిక బద్ధంగా ఉండాలన్నారు. ఇలా ఉండగా మారెమ్మగుడి ఎదురుగా ఉన్న రాజారెడ్డివీధిలో నాలుగు అంతస్తుల భవనానికి అనుమతులు లేకపోవడంతో తొలగించామన్నారు. భవన యజమాని రెండంతస్తులకు మాత్రం అనుమతి పొంది, నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నాడని ఈ మేరకు నోటీసులు జారీ చేసి, తొలగించామన్నారు. ఇలాంటి అక్రమ కట్టడాలను చేపడితే ఖచ్చితంగా కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. నిబంధనల మేరకు మున్సిపాలిటికి పన్నులు చెల్లించి, అనుమతులు పొందాలన్నారు.

లేఔట్లపై నిషేధం…

పట్టణంలో రియల్టర్లు ల్యాండ్‌ కన్వర్షన్‌కు రెవెన్యూశాఖకు పన్నులు చెల్లించకపోవడం, అలాగే మున్సిపాలిటిలో లేఔట్‌ అనుమతి పొందకపోవడంతో ప్రభుత్వానికి తీవ్ర నష్టం రావడంతో కమిషనర్‌ కెఎల్‌.వర్మ లేఔట్లపై కొరడ ఝులిపించారు. పట్టణంలోని మదనపల్లె రోడ్డులోని అనధికార లేఔట్లలో విక్రయాలను గత రెండు రోజుల క్రితం నిషేధిస్తూ జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపారు. అలాగే గత నెలలో గోకుల్‌వీధిలో , చెంగలాపురం, కృష్ణమరెడ్డి ప్రాంతాలలో లేఔట్లలో విక్రయాలను నిషేధించారు. మున్సిపాలిటి, దీని కారణంగా మున్సిపల్‌, రెవెన్యూ ఆదాయం పెరగనున్నది.

డిగ్రీసెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

Tags: Municipality Connerra on illegal structures and unauthorized layouts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *