పార్లమెంట్ లో మున్నాభాయి సీన్

Munnabhai Seen in Parliament

Munnabhai Seen in Parliament

Date:20/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పార్లమెంట్ సాక్షిగా లోక్ సభలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ సీన్ రిపీటైంది. ఆవేశంగా మాట్లాడుతూ ప్రధానిపై ఘాటు విమర్శలు చేసిన రాహుల్ గాంధీ చివరగా ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సడెన్ గా ప్రధాని మోడీ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ చేసిన పనికి మోడీ కూడా షాకయ్యారు. కోపంలో ఉన్నవారిని కూల్ చేసేందుకు మున్నాభాయ్ సినిమాలోనూ ఇలాంటి హగ్ లు ఇస్తుంటాడు హీరో. రాహుల్ కూడా ఇదే పాలో అయినట్టున్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అవిశ్వాసంపై చర్చలో భాగంగా ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఘాటుగా విమర్శలు గుప్పించారు. చర్చ మంచి రసపట్టులో ఉండగా.. ప్రసంగం ముగించేముందు రాహుల్ ప్రధాని సీటు వద్దకు వెళ్లారు. ఏం చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా సడెన్ గా మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. నాపై మీకు కోపం , ద్వేషం ఉన్నాయని.. అవి తొలగిస్తాననంటూ హఠాత్తుగా కౌగిలించుకున్నారు. రాహుల్ చర్యని ఊహించని మోడీ ముందు తత్తరపాటుకు గురయ్యారు. రాహుల్ ఏంచేస్తున్నారో ముందు ఆయనకు అర్ధంకాలేదు. ఆ తర్వాత బాగా మాట్లాడారంటూ రాహుల్ బుజం తట్టారు. ఈ పరిణామంతో సభ్యులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ సీన్ చూసి లోక్ సభలో నవ్వులు పూశాయి. సభ్యులంతా బల్లలు చరుస్తూ, ఆనందం వ్యక్తం చేశారు. సభలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటిదాకా సీరియస్ గా ఉన్న సభ నవ్వులతో మునిగింది.మోడీ దగ్గరనుంచి తిరిగి తనసీటులోకి వచ్చి కూర్చున్నారు రాహుల్. అప్పుడు కూడా తన చర్యలు ఆపలేదు. ఎవరినో చూసి సన్నగా కన్ను గీటారు. రాహుల్ కన్నుకొట్టిన సీన్ కూడా అందరి కంటా పడింది. అప్పటివరకూ మోడీ, అమిత్ షాలపై విమర్శలతో విరుచుకుపడిన రాహుల్ .. ఊహించని విధంగా ఇలా ప్రవర్తించడంతో రాజకీయవర్గాల్లో రాహుల్ కూడా చమత్కారాన్ని వంటబట్టించుకున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రాహుల్ ఇలా చేయాలని చర్చ ప్రారంభం కాకముందే నిర్ణయించుకున్నారేమోనని టాక్ వినిపిస్తోంది. సభలో ఏం మాట్లాడాలో అనే కాదు.. ఏంచేయాలో అనికూడా రాహుల్  ఫుల్ గా ప్రిపేర్ అయినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ చర్యతో కాంగ్రెస్ అధ్యక్షుడు హాట్ టాపిక్ గా మారారు.
పార్లమెంట్ లో మున్నాభాయి సీన్ https://www.telugumuchatlu.com/munnabhai-seen-in-parliament/
Tags:Munnabhai Seen in Parliament

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *