అనంత జిల్లాలో హత్య

అనంతపురం   ముచ్చట్లు:
అనంతపూర్ జిల్లా ఎల్లనూరు మండలం ఆరవెడు గ్రామానికి చెందిన జిట్టా నారాయణప్ప జిట్టా రాజగోపాల్ ను ప్రత్యర్థులు కాపు కాసి అచ్యుతాపురం- వాసాపురం  గ్రామాల మధ్య బండ రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు.
అరవేడు గ్రామానికి చెందిన నారాయణస్వామికి తన తాతల కాలం నుంచి సంక్రమించిన ప్రభుత్వ భూమి ఆధీనంలో ఉండేది .గత నాలుగు నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన నాగేశ్ అనే వ్యక్తి రాత్రికి రాత్రి ఆ స్థలంలో బోరు బావి ని వేసుకున్నారు. విషయం తెలుసుకున్న నారాయణప్ప ఉదయం నాగేశ్ వేసుకున్న బోరుబావి పూడ్చి వేశారు. ఈ విషయంపై ఇరువర్గాలు వాగ్వివాదం పాల్పడగా ఎల్లనూరు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు  చేసుకున్నారు. ఎల్లనూరు పోలీసులు ఇరువర్గాలను పలుమార్లు పిలిచి విచారించారు. ఈ కేసు విషయమై శనివారం ఇరువర్గాలను ఎల్లనూరు పోలీస్ స్టేషన్ కు పిలిపించి తమదైన శైలిలో హెచ్చరించారు. అనంతరం పోలీసులు తమ గ్రామానికి వెళ్లమని చెప్పగా  నారాయణప్ప, రాజగోపాల్ ఇరువురు మోటార్ సైకిల్ గ్రామానికి బయలుదేరారు. అచ్యుతాపురం – వాసాపురం గ్రామాల మధ్య ఉన్న కొండల్లో కాపు కాసిన నాగేష్, దేవరాజ్, మహదేవ్, నాగరాజు తో పాటు మరి కొంత మంది తమ వాహనంతో  మోటర్ సైకిల్ ను ఢీకొట్టి గా వారు కింద పడగానే తలపై బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. రెండు వర్గాలు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు గా ఉండేవారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి డి.ఎస్.పి చైతన్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డి  సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికేటింగ్ ఏర్పాటు చేశారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Murder in Infinite District

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *