మహబూబాబాద్ కేంద్రంలో మర్డర్

మహబూబాబాద్ ముచ్చట్లు:
 
నందినగర్ శివారు గుట్టల్లో లక్ పతి అనే (35) వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసారు. నెల్లికుదురు మండలం శ్రీరంగిరి గ్రామ శివారు సున్నపురాల్ల తండాకు చెందిన బానోతు లక్ పతి, భార్య
లీలా, ఇద్దరు పాపలతో మహబూబాబాద్ కు వచ్చి మిల్ట్రి కాలనీలో ఉంటున్నాడు. ఇటీవల చిన్న ఇల్లు కట్టుకొని మటన్ వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. గురువారం ఉదయమే
నంది నగర్ కాలనీకి చేరుకున్న లక్ పతిని కాలనీ శివారులో హత్య చేసారు. మృత దేహం వద్ద ద్విచక్ర వాహనం పడి ఉండగా, కర్రలు, కారం పొడి, బండరాళ్లు ఉన్నాయి. గుర్తు తెలియని దుండగులు కంట్లో
కారంపొడి చల్లి, కర్రలతో అతి కిరాతకంగా కొట్టి చంపి పరారైనట్లు తెలుస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Murder in Mahabubabad center

Natyam ad