Murder of YSR CP leader

వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య

★ వేడ కొడవలి తో నరికి చంపిన అగంతుకులు

Date:09/12/2019

సోమల ముచ్చట్లు:

సోమల మండలం లో దారుణం చోటు చేసుకుంది. పొలం వద్ద నుంచి ఇంటికి వస్తున్న వైఎస్ఆర్ సీపీ నేత ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొడవలితో నరికి చంపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని పేటూరుకు చెందిన రామేశ్వర ప్రసాద్ ( 47) వైఎస్ఆర్ సీపీ నేత. గతంలో మండల వైస్ ఎంపీపీగా, చదువుకునే రోజుల్లో జూనియర్ కళాశాల వైస్ ఛైర్మన్ గా పని చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడుగా పేరుంది. సోమవారం ఇంటికి సమీపంలోని మామిడి తోటకు ద్విచక్రవాహనంలో వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో హత్య చేశారు. తల మీద నరకడంతో తీవ్ర రక్తస్రావం కావడం తో అక్కడికి అక్కడే మృతి చెందాడు. హత్య కు కారణాలు తెలియాల్సి ఉంది. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పుంగనూరు వైద్యశాలకు తరలించారు. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య కలరు. బాధిత కుటుంబాన్ని పలువురు పార్టీ నాయకులు కలసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

 

దొంగతనాలకు పాల్పడుతున్న యాక్టర్ పోలిసు

 

Tags:Murder of YSR CP leader

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *