ఎవ్వరికి దక్కకూడదనే హత్య

నెల్లూరు  ముచ్చట్లు:

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నెల్లూరు జిల్లాలో గూడూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని తేజస్విని హత్య కేసును పోలీసులు చేధించారు. తామిద్దరం ఆత్మహత్యకు యత్నించామని ఇన్నాళ్లు కట్టుకథలు చెప్పిన వెంకటేశ్వర్లే అసలు నిందితుడని తేల్చారు. తేజస్విని తనను దూరం పెడుతోందన్న కారణంతోనే ఆమెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు వెంకటేశ్వర్లును పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయాలను ఏఎస్పీ వెంకటరత్నం మీడియాకు వివరించారు.గూడూరుకు చెందిన పి.సుధాకర్‌, సరిత దంపతులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి కుమార్తె తేజశ్వని, కుమారుడు కార్తీక్ ఉన్నారు. తేజశ్వని ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతోంది. సుధాకర్‌ సహోద్యోగి చెంచుకృష్ణయ్యతో వీరి కుటుంబంతో ఏడేళ్లుగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు వెంకటేశ్వర్లుతో తేజస్వినికి పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడేవాడు. ఇద్దరి మధ్య వయసు తేడా ఎక్కువ ఉండటంతో పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించారు.ఈ క్రమంలో తేజస్విని తన మొబైల్ నెంబర్‌ని కూడా మార్చేసింది. అయితే, తనకు దక్కని తేజస్విని ఎవరికీ దక్కకూడదని భావించిన వెంకటేశ్వర్లు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఈ నెల ఒకటో తేదీన తేజస్విని ఇంటికి వెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో గొంతులో పొడిచాడు. అప్పటికే ఆమె చనిపోకపోవడంతో చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.అయితే పోలీసుల విచారణలో వెంకటేశ్వర్లు పక్కా ప్లాన్ ప్రకారమే తేజస్వినిని హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కుట్రలో అతడికి మరో ఇద్దరు స్నేహితులు కూడా సహకరించినట్లు గుర్తించారు. ఈ హత్య కేసులో వెంకటేశ్వర్లుని ఏ1 గా పేర్కొనగా.. పృథ్విరాజ్ ఏ2, శివ ఏ3 గా చేరుస్తూ కేసు నమోదు చేశారు. సహ నిందితులను గతంలోనే అదుపులోకి తీసుకోగా.. ప్రధాన నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Murder that should not befall anyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *