కర్ణాటకలో మర్డర్స్…

బెంగళూర్  ముచ్చట్లు:


కర్ణాటకలో మర్డర్స్ కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలు స్టేట్ లో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బీజేపీ నేత ప్రవీణ్‌ హత్యకు గురవగా గురువారం రాత్రి ఫాజిల్‌ను కత్తులతో పొడిచి చంపేశారు. ఈ మర్డర్స్ తో పొలిటికల్ వార్ నెలకొంది. ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాగా.. ఫాజిల్‌ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు, మాస్కు ధరించి కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రెండు రోజుల్లోనే రెండు హత్యలు జరగడం సంచలనంగా మారింది. కాగా.. ప్రవీణ్‌ హత్య ఘటన ఆందోళనలు తీవ్రరూపు దాల్చాయి. బెళ్లారె, సుళ్య ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి. విశ్వహిందూ పరిషత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈ ఘటనను మరవకముందే ఫాజిల్‌ హత్యకు గురవడం కలకలం సృష్టించింది.

 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నేరం వెనుక ఉద్దేశమేంటో తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. తమకు ప్రతి ఒక్కరి జీవితమూ ముఖ్యమేనని అందరూ ఒకటేనని స్పష్టం చేశారు. మరోవైపు.. మంగళూరులో జులై 30 వరకూ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. రాత్రి 10 తర్వాత ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు.అయితే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని.. బొమ్మై రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య డిమాండ్‌ చేస్తున్నారు. ఈ హత్యలు ఇంటెలిజెన్స్‌ వైఫల్యాలను ఎండగడుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, రాష్ట్రంలో భద్రతాపరమైన వైఫల్యాలను సరిచేసి, పౌరుల ప్రాణాలు కాపాడాలని కోరారు.

 

Tags; Murders in Karnataka…

Leave A Reply

Your email address will not be published.