ముర్ము చరిత్ర సృష్టించారు,

దేశం గిరిజన బిడ్డకు ఇచ్చిన గౌరవం
– బిజెపి కిసాన్ మోర్చా పాలసీ & రీసెర్చ్  రాష్ట్ర కన్వీనర్ వై.వి.సుబ్బారావు

అమరావతి ముచ్చట్లు:


భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎన్నికైన శుభ సందర్భంగా 15వ భారతదేశ  రాష్ట్ర పతి గౌరవనీయులు ధ్రౌపతి ముర్ము గారికి బిజెపి కిసాన్ మోర్చా పాలసీ & రీసెర్చ్  రాష్ట్ర కన్వీనర్ వై.వి.సుబ్బారావు శుభాకాంక్షలు తెలియజేశారు. బారతదేశం గిరిజన బిడ్డకు ఇచ్చిన గౌరవం అని, బారతదేశ మొదటి పౌరురాలిగా అత్యున్నత పదవికి ఎన్నికైన గిరిజన బిడ్డగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారని, ఆమె గొప్ప రాష్ట్రపతిగా పేరు సంపాదిస్తారని, ఆమె పేదలు, అణగారిన వర్గాల ఆశారేఖగా ఉద్భవించారని వై.వి.సుబ్బారావు అన్నారు. 130 కోట్ల మంది దేశ ప్రజలు ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’జరుపుకుంటున్న వేళ గిరిజన బిడ్డ రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం గొప్ప సంతోషకర విషయం అన్నారు. మారుమూల కుగ్రామంలో జన్మించిన ముర్ము సాధించిన విజయాలు దేశ ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం అని రాష్ట్ర కన్వీనర్ వై.వి.సుబ్బారావు ఆనందం వ్యక్తం చేశారు.

 

Tags: Murmu made history,

Leave A Reply

Your email address will not be published.