సంగీతానికి మూల విరాట్ త్యాగరాజ స్వామి- విద్వాన్ పద్మావతి
కాకినాడ ముచ్చట్లు:
కర్ణాటక సంగీతానికి మూలవిరాట్ అయిన త్యాగరాజ స్వామి అసంఖ్యాక కీర్తనలకు ప్రాణం పోసారని విద్వాన్ టి. పద్మావతి పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మావతి మాట్లాడుతూ తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగరాజస్వామి లో మూర్తి భవించాయని అన్నారు. సంగీతంలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం కన్నా భగవారాధనకు ఒక సాధనగా సంగీతాన్ని ఆయన వినియోగించారని అన్నారు 96 కోట్ల సార్లు రామ నామాన్ని జపించి స్వీయానుభవ బావనలే కృతి రూపంలో మలచి గంధర్వ గాన మ దురానుభూతిగా లోకానికి అందించారని అన్నారు. ఈ సందర్భంగా పద్మావతి త్యాగరాజ కీర్తనలను ఆలపించారు. అనంతరం అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో పద్మావతిని ఘనంగా సత్కరించారు. తొలుత త్యాగరాజస్వామి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, రేలంగి బాపిరాజు, రాజా, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
Tags: Music source Virat Thyagaraja Swamy- Vidwan Padmavati

