Muslim protest protests continued on the seventeenth day

పదిహేడవ రోజు కొనసాగిన ముస్లింల నిరసన దీక్షలు

Date:27/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ముస్లింలు 17వ రోజు రిలే దీక్షలు నిర్వహించారు. సోమవారం పట్టణంలోని నక్కబండకు చెందిన మసీదు ముతవల్లి అమీర్‌జాన్‌ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ప్లకార్డులలో పౌరసత్వ సవరణ చట్టం వద్దు… ఎన్‌ఆర్‌సీ, సీఐఏ, ఎన్‌ఆర్‌పీ రద్దుపరచండి….కొత్తచట్టాలను బహిష్కరిస్తాం…. రాజ్యాంగాన్నికాపాడండి…. దేశాన్నివిభజించ వద్దు అన్న నినాదాలతో కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అమీర్‌జాన్‌ మాట్లాడుతూ భారతదేశంలో అంబేద్కర్‌ తయారు చేసిన రాజ్యాంగ హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. బారతదేశంలో ముస్లింలకు రక్షణ కరువైందని, పౌరసత్వ సవరణ చట్టాలతో ముస్లింలను నామరూపాలు లేకుండ చేసేందుకు ప్రభుత్వం కుట్రలుపన్నుతోందని ఆరోపించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

యుటియఫ్ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్ పంపిణీ

Tags: Muslim protest protests continued on the seventeenth day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *