రామాలయం కట్టించిన ముస్లిమ్ సర్పంచ్

ఖమ్మం ముచ్చట్లు:

సర్పంచ్‌గా గెలిస్తే ఆలయం నిర్మిస్తానన్న హామీని తు.చ. తప్పకుండా అమలు చేసి చూపించిన ముస్లిం మైనార్టీ సర్పంచ్‌ గ్రామస్తుల మన్ననలు అందుకుంటున్నారు.ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడి దంపాడు సర్పంచ్‌గా ఎస్‌కే మీరా గతంలో ఓసారి గెలిచారు. రెండోసారి కూడా పోటీలోకి దిగిన ఆయన తనను గెలిపిస్తే గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని సొంత డబ్బుతో నిర్మి స్తానని ప్రకటించారు.అనుకున్నట్లుగానే గెలిచిన వెంటనే సర్పంచ్‌ మీరా రూ.25 లక్షలు సమకూర్చారు. మరో రూ.25 లక్షలు గ్రామస్తులు, దాతల నుంచి సేకరించి గ్రామంలో శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కాగా, గురువారం విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరయ్యే భక్తులందరికీ అన్నదానం ఖర్చు కూడా మీరా భరించనుండటం మరో విశేషం.

 

Tags: Muslim Sarpanch who built Ramalayam

Post Midle
Post Midle
Natyam ad