Muslim women rally to repeal the Citizenship Amendment Act

పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం మహిళలు భారీ ర్యాలీ

– పట్టణంలో ప్రదర్శన
– జాతీయ రహదారిపై బైఠాయింపు
– స్తంభించిన ట్రాఫిక్‌

Date:21/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటు అంజుమన్‌ కమిటి ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు రోడ్డుపై ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. పట్టణంలోని షాదిమహల్‌ నుంచి తూర్పు వెహోగశాల, సుబేదారువీధి, పోస్టాఫీసువీధి, నాగపాళ్యెం మీదుగా ఇందిరా సర్కిల్‌ చేరుకున్నారు. ఇందిరా సర్కిల్‌లోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో చేపట్టిన సవరణ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహిళలు ప్లకార్డులు పట్టుకుని, జాతీయ జెండాను పట్టుకుని మతాన్ని విభజించద్దు….హిందూముస్లిం బాయ్‌బాయ్‌ …అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని కాపాడండంటు నినాదాలు చేశారు. సీఐ మదుసూదనరెడ్డి, ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

తూర్పుగోదావరి వైసీపీలో రచ్చరచ్చ

Tags: Muslim women rally to repeal the Citizenship Amendment Act

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *