పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముస్లిం యూత్ నేతలు కలిశారు. బుధవారం సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరిఫ్, కౌన్సిలర్ కిజర్‌ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం నాయకులు తిరుపతిలో పెద్దిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పుంగనూరు పరిణామాలపై చర్చించారు. పుంగనూరు ప్రజలకు తమ కుటుంబం అండగా ఉంటుందని, ఎవరు అధైర్యపడరాదని, ఏకష్టం వచ్చిన అండగా ఉంటామని పెద్దిరెడ్డి హామి ఇచ్చారు. ఆయనను కలిసిన వారిలో నూరుల్లా, నూర్, ఎస్.ఇర్ఫాన్, బాబుల్లి, బాలు, అయాజ్, ఇర్ఫాన్‌బాషా, సుల్తాన్‌ఖాజా, అహమ్మద్, గౌసి, అమ్ముకుట్టి తదితరులు ఉన్నారు.
Tags:Muslim youth who met former minister Peddireddy