Natyam ad

బిజెపి, తెలుగుదేశంకు ఓట్లు వేస్తే ముస్లింలు మనుగడ కోల్పోతాం

– అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఎంఎస్‌.సలీం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

బిజెపి, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఓట్లు వేస్తే ముస్లింలకు మనుగడ ఉండదని, మత తత్వ పార్టీలకు గుణపాఠం నేర్పాలని అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఎంఎస్‌.సలీం పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి రూ.25 లక్షలతో నిర్మించిన అంజుమన్‌ షాదీమహాల్‌ను మంత్రి ప్రారంభించారు. సలీం మాట్లాడుతూ మైనార్టీలకు విఘాతం కలిగించే సీఐఏ ను వ్యతిరేకించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. జగనన్న పాలనలో మనశాంతిగా ముస్లింలు , క్రిస్టియన్లు, హిందూవులు సోదరబావంతో జీవనం చేస్తున్నామన్నారు. ఉమ్మడి పార్టీల పరిపాలన వస్తే ఊచకోతలు కోస్తారని , మత విధ్వేషాలకు రాష్ట్రం నిలయమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల ఓట్లు రెండు ఫ్యాన్‌ గుర్తుకు వేయాలని , మతతత్వ పార్టీలకు , వారితో పొత్తులు పెట్టుకున్న పార్టీలకు తగిన గుణపాఠం నేర్పి , ముస్లింల మనోభావాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముస్లిం పెద్దలు ఖాదర్‌, జాఫర్‌, ఇబ్రహిం, అమ్ము, కిజర్‌ఖాన్‌, గిడ్డు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Muslims will lose their survival if they vote for BJP and Telugu Desam

 

Post Midle