చట్టాలపై అవగాహన కలిగివుండాలి

Date:05/12/2019

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల పట్టణంలో గురువారం నాడు రావూస్ జూనియర్ కళాశాల నందు నంద్యాల శక్తి టీమ్ వారి అద్వర్యం లో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఏ ఎం వి అప్పారావు  అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన నంద్యాల టూ టౌన్ సిఐ పి సుబ్రహ్మణ్యం  చట్టాల పైన విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ  మాట్లాడుతూ ఆపదలో ఉన్నప్పుడు 100 ఫోన్ చేయాలని తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితి  ఎదురైనా మహిళలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని మీకు అన్యాయం జరుగుతే మేము ఉన్నామని విద్యార్థినిలకు భరోసా ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఏ ఎం అప్పారావు మాట్లాడుతూ మా కళాశాల నందు విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే చదువుతోపాటు నైతిక విలువల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రోడ్డ సుంకయ్య శక్తి టీం మహిళా కానిస్టేబుల్స్ అధ్యాపకులు విధ్యార్ధిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి

 

Tags:Must be aware of the laws

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *