రబి సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలి

-విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ హేమ సుస్మితనెల్లూరు ముచ్చట్లు:


రాబోయే రబి సీజనులో రైతులకు సకాలంలో విత్తనాలు అందించేందుకు సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ 13 జిల్లాల రీజనల్ మేనేజర్లను ఉద్దేశించి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ పేర్నాటి హేమ సుష్మిత పిలుపునిచ్చారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సనుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగులో రోజువారి కూలీలకు సంబంధించి రవాణా చార్జీల కింద, సెక్యూరిటీ గార్డుల నెలవారి వేతనాలు పెంచాలని బోర్డు దృష్టిలో పెట్టడం జరిగిందన్నారు.రవాణా చార్జీల కింద 40 రూపాయలు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులకు సంబంధించి నెలవారి వేతనాన్ని 1200 రూపాయలు పెంచుతున్నట్లు బోర్డు నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. అక్టోబర్ నెల నుంచి పెరిగిన రవాణా చార్జీలను, సెక్యూరిటీ గార్డుల వేతనాలను అందించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర రైతాంగానికి సంబంధించి వరి సబ్సిడీ విత్తనాలను ప్రాంతాల వారీగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకే రకమైన సబ్సిడీ ఇచ్చే విధంగా, అలానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న “ట్రైబల్స్”కు ఐటీడీఏ ద్వారా అందరికీ కూడా ఒకే రకమైన సబ్సిడీని ఇవ్వాలనే ప్రతిపాదనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, దాన్ని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తామని చైర్ పర్సన్ హేమ సుశ్విత తెలిపారు.

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఉద్యోగులను నియమించుకునేందుకు బోర్డు నిర్ణయం తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు.పేర్నాటి హేమ సుష్మిత  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సనుగా బాధ్యతలు తీసుకొని ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా 13 జిల్లాల రీజనల్ మేనేజర్ల సమావేశంలో రాబోయే రబి సీజనుకు సంబంధించి రైతాంగానికి సబ్సిడీ విత్తనాలను ఏ విధంగా అందించాలి “ప్లాన్ ఆఫ్ యాక్షన్” సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే అని అన్ని డిస్టిక్ మేనేజర్లతో మీటింగ్ ఏర్పాటు చేయడం, రాబోయే రబి సీజన్లో రైతులకు వరి, మినుము, పెసర, వేరుశనగ, శనగ, పొద్దు తిరుగుడు, పత్తి, మిరప వీటన్నిటినీ కూడా సకాలంలో రైతులకు ఆర్బికేల ద్వారా ఇచ్చేందుకు అన్ని డిస్టిక్ మేనేజర్లను సమాయత్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ విసి అండ్ ఎండి శేఖర్ బాబు , 13 జిల్లాల రీజనల్ మేనేజర్లు, ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Must be ready to provide required seeds to the farmers during Rabi season

Leave A Reply

Your email address will not be published.