నిరంతరం సాగాలి

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

 

 

పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారికి ఇరువైపులా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మున్సిపల్‌ వార్డులు, గ్రామాల్లో ఎక్కడ చెత్త ఉండకూడదని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.చెత్తాచెదారం తీసివేయాలని, ప్రతి ఇంటి ముందు 6 మొక్కలు నాటాలని కోరారు. ఊరంతటినీ శుభ్రంగా ఉంచాలని, వార్డు సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.గతంలో పాలకొండ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు. రూ. 14 లక్షల రూపాయలతో పాలకొండ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామంలో మురికి కాలువ సమస్యను రేపటిలోగా పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Must go constantly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *