మ్యుటేషన్స్ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి
-జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన సీసీఎల్ఏ జి. సాయి ప్రసాద్
నంద్యాల ముచ్చట్లు:
భూ క్రయవిక్రయాలు జరిగి రెవెన్యూ రికార్డులో మార్పుకు సంబంధించిన మ్యూటేషన్ దరఖాస్తుల మీద ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని భూ పరిపాలనా శాఖ ముఖ్య కమీషనర్ జి. సాయి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విజయవాడలోని తన కార్యాలయం నుండి సీసీఎల్ఎ జి. సాయి ప్రసాద్ సంబందిత శాఖల కార్యదర్శులతో కలిసి మ్యుటేషన్స్, జగనన్న శాశ్విత భూ హక్కు – భూ రక్ష పథక రీ సర్వే పనుల ప్రగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా భూ పరిపాలనా శాఖ ముఖ్య కమీషనర్ జి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ మ్యుటేషన్స్ కు సంబంధించిన దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు భూముల సమగ్ర రీ సర్వేపనులను అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సూచించారు.
జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద రెవెన్యూ భూముల స్వచ్చీకరణ, రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే భూ రికార్డుల స్వచ్చీకరణ, గ్రౌండ్ వ్యాలీడేషన్, 13 నోటిఫికేషన్, ఓఆర్ఐ ప్రక్రియను నిర్ణీత సమయంలోపు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ మ్యుటేషన్స్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పూర్తి చేసేందుకు శ్రద్ద తీసుకుంటున్నామని తెలిపారు. మండల తాసిల్దార్లతో టెలి కాన్ఫరెన్సులు నిర్వహించి త్వరితగతిన పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో చేపట్టిన భూముల రీసర్వే పనుల వేగవంతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ల్యాండ్ అండ్ సర్వే, మండల సర్వేయర్లకు లక్ష్యాలు కేటాయించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ఆదేశించామన్నారు. నంద్యాల కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ల్యాండ్ సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Mutations applications should be processed within the specified time frame