Natyam ad

ఎండలకు  అల్లాడుతున్న మూగజీవాలు

తిరుపతి ముచ్చట్లు:


తిరుపతి నగరంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర జూపార్కు ఆసియాలోనే అతి పెద్దది. దాదాపు 1,250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జూపార్కులో.. మొత్తం 1145 రకాల జంతువులు, వివిధ రకాల పక్షులు, సర్పాలు ఉన్నాయి. సింహాల గర్జన, పులుల గాండ్రింపు, ఏనుగుల ఘీంకారాలు, పక్షలు కిలకిలరావాలు, బుస కొట్టే సర్పాలను ఇక్కడ చూడవచ్చు. నిత్యం వచ్చే సందర్శకులతో ఈ జూపార్క్ సందడిగా ఉంటుంది.ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. తిరుపతి నగరంలో దంచికొడుతున్న ఎండలు.. జంతువుల పాలిట శాపంగా మారాయి. వన్య ప్రాణులు అల్లాడి పోతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఎస్వీ జూపార్కులో వన్య ప్రాణుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వన్య ప్రాణులు వేసవి తాపం కారణంగా అనారోగ్యానికి గురవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్‌క్లోజర్స్‌పై గ్రీన్ మ్యాట్ కప్పి చల్లబరుస్తున్నారు.

 

 

మూడు పూటలా నీటితో తడుపుతున్నారు. వన్య ప్రాణులు సంచరించే ప్రాంతాల్లో చల్లదనం ఉండేలా నీటి స్పింక్లర్స్ ఏర్పాటు చేశారు.ప్రాణులకు అందించే ఆహారంలోనూ మార్పులు చేశారు. కోతులు, ఎలుగుబంట్లు, ఏనుగులకు పుచ్చకాయలు, కీరదోస వంటి పండ్లను అందిస్తున్నారు. రోజుకు రెండు పూటలా.. గ్లూకోజ్‌ను ఇస్తూ.. నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జూపార్కులో ఉన్న ఏనుగుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.‌ వాటిని తరుచూ నీటిలో తడిపేలా ఏర్పాట్లు చేశారు. జంతువుల సంరక్షణ కోసం అధికారులు చేపడుతున్న చర్యలను సందర్శకులు అభినందిస్తున్నారు.

 

Post Midle

Tags; Mute creatures basking in the sun

Post Midle