Natyam ad

మూగబోయిన మైకులు.. ప్రచారానికి తెర, అమల్లో ఉండే ఆంక్షలివే..!

అమరావతి ముచ్చట్లు:

 

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మే 11 శనివారం సాయంత్రం 5 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది.ఐదు గంటలకు ప్రచారపర్వం ముగిసిపోవటంతో.. రాష్ట్రమంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. హైదరాబాద్‌…. తెలంగాణలో స్థిరపడిన ఏపీ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ ఊర్లకు లక్షలాదిగా వస్తున్నారు.

ఆంక్షలివే.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే..

Post Midle

★ ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
★ ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటారు.
★ ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజుల పాటు (మే 11 సాయంత్రం 5 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు) వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు. లిక్కర్ అమ్మకాలు నిషిద్ధం.
★ పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి పోలీసులు డేగ కన్ను వేస్తారు.
★ ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్ధం.
★ మొబైల్స్‌ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్‌ సర్వేలు వెల్లడించడం నిషిద్ధం.
★ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది.

 

Tags: Mute microphones.. Screen for propaganda, restrictions in place..!

Post Midle