మటన్ వ్యాపారికి షాకిచ్చిన కస్టమర్..

వరంగల్ ముచ్చట్లు:

తను ఆర్మీ జవాన్ అని నమ్మించి అకౌంట్ లోని డబ్బంతా దోచేసిన సంఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది..ఆన్లైన్ లో మటన్ వ్యాపారికి ఆర్డర్ ఎర వేసిన ఆ సైబర్ మోసగాడు రూ.75 వేలు కాజేశాడు.. ఆర్మీ జవాన్ అనుకొని నమ్మి నిలువు దోపిడీకి గురైన బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ కు చెందిన రాహుల్ సోనాల్ అనే మటన్ వ్యాపారికి ఈనెల 20వ తేదీ రాత్రి 9.48 గంటలకు వికాస్ పటేల్ అనేవ్యక్తి ఫోన్ చేశాడు.. 06371278595 నెంబరు నుంచి ఫోన్ చేసి ఆన్లైన్లో మటర్ ఆర్డర్ చేశాడు.. 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు 20 కిలోల మటన్ కావాలని కోరాడు.. దీంతో మీరు ఎవరో నాకు పరిచయం లేదని, ఎలా మిమ్మల్ని నమ్మి ఇవ్వాలని మటన్ వ్యాపారి ప్రశ్నించాడు.. ఈ క్రమంలో ఆ మోసగాడు తను ఆర్మీ జవాన్ అని, తన పేరు వికాస్ పటేల్ అని పరిచయం చేసుకుని తన నకిలీ ఐడీకార్డు ప్రూఫ్ ను వాట్సాప్ చేశాడు.. మరుసటి రోజు 21న ఉదయం 9.14 గంటలకు మరోసారి ఫోన్ చేసి మటన్ డబ్బులు ఎంత అవుతాయని అడిగాడు. మటన్ వ్యాపారి రూ.14వేలు అవుతుందని చెప్పగా, ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తానని చెప్పి, తనది ఆర్మీ అకౌంట్ అని వాట్సాప్ క్యూఆర్ కోడ్ ను పంపాడు..అతన్ని పూర్తిగా నమ్మిన మటన్ వ్యాపారి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడంతో వికాస్ పటేల్ అతడి ఖాతాలో రూ.5 జమ చేశాడు. కన్ఫర్మేషన్ కోసం మరోసారి కోడ్ ను స్కాన్ చేయాలని వికాస్ పటేల్ సూచించడంతో మటన్ వ్యాపారి అలాగే చేశాడు.. అంతే మరుక్షణమే మటన్ వ్యాపారి ఖాతాలో ఉన్న రూ.75వేలు మాయమయ్యాయి. షాక్ తిన్న మటన్ వ్యాపారి రాహుల్ సోనాల్ వెంటనే వికాస్ పటేల్ కు ఫోన్ చేశాడు.. కానీ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: Mutton trader shocks customer ..

Leave A Reply

Your email address will not be published.